భారత జాతీయ కాంగ్రెస్
స్థాపనకు
ముందు అనేక సంస్థలు
ప్రారంభమైనా
వాటిలో ప్రధానమైంది
1876లో కలకత్తాలో
సురేంద్రనాథ్
బెనర్జీ,
ఆనందమోహన్
బోస్ స్థాపించిన
ఇండియన్
అసోసియేషన్.
ఈ సంస్థ సివిల్ సర్వీస్ వ్యవస్థలో సంస్కరణలు, కౌలుదారుల హక్కుల రక్షణ, తేయాకు తోటల్లో పనిచేసే కార్మికుల హక్కులు మొదలైన అంశాలపై పోరాటం చేసింది. ఈ సంస్థ బెంగాల్‌లోని పలు గ్రామాలు, పట్టణాల్లో, బెంగాల్ రాష్ట్రం బయట అనేక నగరాల్లో శాఖలను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్త సంస్థగా ఎదగడానికి 1883, 1885లో రెండు జాతీయ సమావేశాలను
సైతం నిర్వహించింది.
భారత జాతీయ కాంగ్రెస్
స్థాపనకు
ముందున్న
సంస్థలన్నీ
ఏదో ఒక ప్రాంతానికి
మాత్రమే
పరిమితమయ్యాయి.
దీంతో కొందరు దూరదృష్టి
గల రాజకీయవేత్తలు
దేశవ్యాప్త
సంస్థను
ఏర్పాటు
చేయాల్సిన
ఆవశ్యకతను
గుర్తించారు.
పదవీ విరమణ పొందిన ఆంగ్లేయ
ఉద్యోగి
అలాంటి సంస్థను
ఏర్పాటు
చేయడానికి
ప్రయత్నాలు
ప్రారంభించినపుడు,
వారంతా అతనికి తమ సహకారం అందించారు.
దీంతో భారత జాతీయ కాంగ్రెస్
1885 డిసెంబరులో
ఏర్పాటయ్యింది.
కాంగ్రెస్
మొదటి సమావేశం
బొంబాయిలో
ఉమేష్ చంద్ర బెనర్జీ
అధ్యక్షతన
జరిగింది.
ఈ సమావేశానికి దేశం నలుమూలల నుంచి 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. కాంగ్రెస్ రెండో సమావేశం 1886 డిసెంబరులో కలకత్తాలో జరిగింది.
|
భారత జాతీయోద్యమం మూడు దశల్లో సాగింది.
1. మితవాద యుగం (1885-1905)
2. అతివాద యుగం (1905-1919)
3. గాంధీ యుగం (1919-1947)
మితవాద యుగం:
మొదట్లో ప్రభుత్వ విధానాలను, చర్యలను విమర్శిస్తూ, సంస్కరణలు చేపట్టాలని కోరుతూ కాంగ్రెస్ తీర్మానాలు చేసింది. ప్రతి సంవత్సరం బ్రిటిష్ ప్రభుత్వానికి తమ
విధేయతను ప్రకటిస్తూ తీర్మానించింది. మొదట్లో కాంగ్రెస్ పట్ల
బ్రిటిష్ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించింది. అయితే ప్రభుత్వం కాంగ్రెస్‌ను అల్ప
సంఖ్యాకులకు ప్రాతినిధ్యం వహించే సంస్థగా భావించింది. దీంతో 19వ శతాబ్దం చివరి నాటికి కాంగ్రెస్ డిమాండ్లలో, పోరాట విధానాల్లో మార్పు వచ్చింది. ఇరవయ్యో శతాబ్దం ప్రారంభంలో మితవాద జాతీయ నాయకులు ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ దేశాల్లో మాదిరిగా బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉంటూనే భారతదేశంలో స్వపరిపాలనకు అనుమతించాలని కోరారు. మొదటిసారిగా 1905లో
గోఖలే, 1906లో
దాదాబాయి నౌరోజీ కాంగ్రెస్ తరఫున ఈ డిమాండ్ చేశారు.
|
ముఖ్యమైన మితవాద నాయకులు: దాదాబాయి నౌరోజీ, ఎమ్.జి.రనడే, సురేంద్రనాథ
బెనర్జీ, ఫిరోజ్‌షా
జె.
మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, గోపాలకృష్ణ గోఖలే, దిన్షా
వాచా, రాస్ బిహారి ఘోష్, ఆనందమోహన్ బోస్.
ప్రధానమైన డిమాండ్లు:
1. భారతీయులకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పిస్తూ గవర్నర్ జనరల్ కౌన్సిల్‌ను విస్తరించాలి.
2. ఉప్పు మీద పన్నును తగ్గించాలి.
3. రక్షణ బడ్జెట్‌ను తగ్గించాలి.
4. భారత వస్త్ర పరిశ్రమను తిరిగి అభివృద్ధి చేయాలి.
5. ఆంగ్లేయ అధికారుల స్థానంలో భారతీయ అధికారులను నియమించాలి.
6. పత్రికా స్వేచ్ఛ
7. భూస్వాముల అరాచకాల నుంచి రైతులకు రక్షణ కల్పించాలి.
8. పోటీ పరీక్షలను భారతదేశంలో నిర్వహించాలి.
9. న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక శాఖ నుంచి వేరుచేయాలి.
10. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులను ఏర్పాటుచేసి రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందజేయాలి.
11. భారతదేశంలో సాంకేతిక, పారిశ్రామిక విద్యను అభివృద్ధి చేయాలి
మితవాదుల విధానాలు:
మితవాదుల విధానాలను 'రాజ్యాంగబద్ధమైన పోరాటం'గా పేర్కొనవచ్చు. వారు సమావేశాలు నిర్వహించడం, ప్రసంగాలు చేయడం, తీర్మానాలు చేయడానికే పరిమితమయ్యారు. చాలా అరుదుగా మాత్రమే విదేశీ వస్తువుల బహిష్కరణ, స్వదేశీ వస్తువుల వాడకం కార్యక్రమాలను చేపట్టారు.
వారు తమ రాజకీయ కార్యకలాపాలను విద్యావంతులకే పరిమితం చేసి, సామాన్య ప్రజలు జాతీయోద్యమంలో పాలుపంచుకోవడానికి అవకాశం కల్పించలేదు. రాజకీయ హక్కులు, స్వయం పాలనను క్రమంగా సాధించాలనుకున్నారేగానీ వెంటనే కావాలని మితవాద నాయకులు కోరలేదు.
కాంగ్రెస్ పట్ల బ్రిటిష్ ప్రభుత్వ వైఖరి:
పదవీవిరమణ చేసిన ఆంగ్లేయ ఉద్యోగి అలన్ ఆక్టేవియన్ హ్యూమ్ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రక్షించడానికి కాంగ్రెస్‌ను స్థాపించాడు. అందువల్ల అనేకమంది బ్రిటిష్ రాజకీయవేత్తలు కాంగ్రెస్‌ను సమర్థించారు. అప్పటి వైస్రాయి డఫ్రిన్ 1886లో కాంగ్రెస్ సదస్సుకు హాజరైన ప్రతినిధులకు గొప్ప విందును ఏర్పాటు చేశాడు.
అలాగే 1887లో కాంగ్రెస్ మూడో సమావేశం సందర్భంగా మద్రాసు గవర్నర్, కాంగ్రెస్ ప్రతినిధులకు విందును ఏర్పాటు చేశాడు. కాంగ్రెస్ స్థాపించినపుడు ప్రభుత్వం సహాయ, సహకారాలను అందించింది. కాంగ్రెస్ సమావేశాలలో పాల్గొనడానికి ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతి ఇచ్చారు.
అయితే కాంగ్రెస్ - బ్రిటిష్ ప్రభుత్వం మధ్య ఈ సంబంధాలు, సహకారం తాత్కాలికమే. ప్రభుత్వం క్రమేణా కాంగ్రెస్‌కు సహకరించడానికి బదులు దాని పట్ల అనుమానాన్ని పెంచుకొంది. కాంగ్రెస్ బలం పెరగడం, దాని సభ్యులు ప్రజలకు రాజకీయ శిక్షణను ఇవ్వడం, ప్రభుత్వాన్ని విమర్శించడం దీనికి ప్రధాన కారణాలు. గవర్నర్ జనరల్ మొదలు ప్రభుత్వ అధికారులు అంతా జాతీయ నాయకులను అవిధేయులైన బాబులు, కుట్రపూరితమైన బ్రాహ్మణులు, క్రూరమైన ప్రతినాయకులుగా వర్ణించారు. బ్రిటిష్ వార్తాపత్రికలు సైతం కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించాయి. కాంగ్రెస్ పట్ల ప్రభుత్వ వ్యతిరేక ధోరణి వల్ల కాంగ్రెస్ నాలుగో సమావేశాన్ని నిర్వహించడానికి స్థలం దొరకని పరిస్థితి దాపురించింది. 1890లో బెంగాల్ ప్రభుత్వం కాంగ్రెస్ సమావేశాలకు హాజరుకావడంపై ఉద్యోగులకు ఆంక్షలు విధించింది.
కాంగ్రెస్ బలాన్ని తగ్గించడానికి ప్రభుత్వం 'విభజించి - పాలించు' సూత్రాన్ని అమలుచేసింది. సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్, రాజా శివప్రసాద్, ప్రభుత్వానికి విధేయులైన మరికొంత మందిని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభించేలా ప్రభుత్వం ప్రోత్సహించింది. కాంగ్రెస్‌ను హిందూ సంస్థగా చిత్రించి, 1906లో ముస్లింలీగ్‌ను ప్రారంభించేలా ముస్లింలను రెచ్చగొట్టింది. దీంతోపాటు ప్రభుత్వం అణచివేత విధానాలను చేపట్టింది.
విజయాలు
¤
ప్రజలలో రాజకీయ చైతన్యం కల్పించడం
¤
ప్రజాస్వామ్యం, జాతీయతా భావాలను ప్రచారం చేయడం
¤
సామ్రాజ్యవాద విధానాల ద్వారా బ్రిటిషర్లు భారతదేశ సంపదను దోచుకుంటున్న విధానాన్ని ప్రజలకు తెలియజేయడం. ఉదా: దాదాబాయి నౌరోజీ ప్రతిపాదించిన సంపద తరలింపు సిద్ధాంతం.
¤
భవిష్యత్తులో భారత జాతీయ ఉద్యమం మరింత ఉద్ధృతం కావడానికి అవసరమైన గట్టి పునాదులు నిర్మించడం.
¤
బ్రిటిష్ ప్రభుత్వం 1892లో భారత కౌన్సిళ్ల చట్టం రూపొందించడం.
అపజయాలు
¤
సామాన్య ప్రజలను జాతీయోద్యమంలో భాగస్వాములుగా చేయకపోవడం.
¤
చాలాకాలం వరకు బ్రిటిష్ వారి నిజమైన స్వభావాన్ని గ్రహించలేకపోవడం.
¤
రాజ్యాంగబద్ధమైన పోరాటం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఎలాంటి లాభం పొందకపోవడం.
|
|